డైలీ భారత్, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం( 7) సెగ్మెంట్లకు అవసరమైన స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్లను శనివారం పటాన్చెరు మండలం రుద్రారం వద్ద గల గీతం యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీతో కలిసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేష్, డిఎస్పీ, డిప్యూటీ కలెక్టర్ మహిపాల్ రెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ ,
అందోల్ రెవిన్యూ డివిజనల్ అధికారులు, పటాన్చెరు తాసిల్దార్, ఆర్ అండ్ బి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.