| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుండి 24 మంది బాల బాలికల ఎంపిక

రాష్ట్రస్థాయి టచ్ రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుండి 24 మంది బాల బాలికల ఎంపిక

డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా  చేగుంట మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది క్రీడాకారులు, క్రీడాకారినిలు పాల్గొనగా అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్రస్తాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు.బాలుర విభాగంలో మంచి ప్రతి చూపిన క్రీడాకారులు రోహిత్, భరత్, మనోహర్, వంశీకృష్ణ, చరణ్, భాను, విజయ్, మణికంఠ, రాకేష్, బిట్టు, చాణిక్య, అభిచరణ్ ఎంపికవ్వగా స్టాండ్ బైగా సాయి, రెశ్వంత్, హర్షవర్ధన్, కార్తీక్, విశాల్ ఉన్నారని, బాలికల విభాగంలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, అక్షయ, వర్షశ్రీ, సారిబా, నందిని, అఖిల, వైష్ణవి, వర్ష, రాణి కుమారి ఎంపికవ్వగా స్టాండ్ బైగా  వైష్ణవి, సాహితి, లక్ష్మీ ప్రసన్న, అనురాధ, సెలెక్ట్ అయినారని ఆయన తెలిపారు. ఇక్కడ సెలక్ట్ అయిన బాల, బాలికలు ఈనెల చివరి వారంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి, పిడి వెంకటేష్,సతీష్,రఫీ రెఫరీలు బాలరాజ్, చంటి పాల్గొన్నారు.

Previous ఆల్ ఫోర్స్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : టీజీవిపి
Next కాంగ్రెస్ పార్టీలో చేరిన భీమవరం శ్రీనివాస్
ADVERTISEMENT