Posted on 2026-02-02 15:15:17
టీఎన్జీవో కొవ్వొత్తుల ర్యాలీ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: గత నెల 23 న గంజాయి స్మగ్లర్ల అమానుష దాడిలో తీవ్రంగా గాయపడి, నిమ్స్ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూ... తుది శ్వాస వదిలిన, ఎక్సైజ్ మహిళ కానిస్టేబుల్ కుమారి గాజుల సౌమ్య కి
సంతాప సూచకంగా టీఎన్జీవో ఆధ్వర్యంలో... ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ల అధ్యక్షతన, సోమవారం టిఎన్జీవో జిల్లా కార్యాలయం నుండి ఎన్టీఆర్ చౌరస్తా,కోర్టు చౌరస్తా మీదుగా... నగరంలోని ప్రధాన కూడలీల గుండా అమర్ రహే... గాజుల సౌమ్యజి.. అమర్ రహే ....అంటూ నినాదాలు చేస్తూ,... కొవ్వొత్తుల శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించి, శ్రద్ధాంజలి ఘటించారు
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమన్ కుమార్ మాట్లాడుతూ... ధీరవనిత కుమారి గాజుల సౌమ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ,...టీఎన్జీవో సంఘం వారి కుటుంబానికి అండగా ఉంటుందని, దాడికి పాల్పడిన దోషులను చట్టరీత్యా వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమన్ రెడ్డి, టీఎన్జీవో కేంద్ర బాధ్యులు పోల శ్రీనివాస్, మచ్చుకూరి సతీష్, జిల్లా సహాధ్యక్షులు చిట్టి నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు అతీక్అహ్మద్, కె.పి సునీత, మంజుల, జాఫర్ హుస్సేన్, మాణిక్యం, పురుషోత్తం,అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, వివిధ యూనిట్ శాఖల అధ్యక్ష కార్యదర్శులు జ్ఞానేశ్వర్, సృజన్ కుమార్ ,సూర్య ప్రకాష్, విశాల్, నాగేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని శాఖల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు, క్లాస్ ఫోర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్, టీఎన్జీవో ముఖ్య సలహాదారులు వనమాల సుధాకర్, అన్ని శాఖల ఉద్యోగులు, మహిళా ఉద్యోగ సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, ఆ వీరవనితకు ఘనంగా నివాళులు అర్పించారు
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >