Posted on 2026-01-30 16:01:06
రెండవ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి బేగరి రవి వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ చివరి రోజున నిజామాబాద్ రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బేగరి రవి శుక్రవారం నామినేషన్ దాఖలు వేశారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలోని మాణిక్ బండర్, మాణిక్ బండర్ తండా, బోర్గాం, దాస్ నగర్ ఇతర గ్రామాలలో అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రెండవ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి బేగరీ రవి పేర్కొన్నారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధిష్టానం కార్పొరేటర్ గా అవకాశం ఇచ్చినందుకు వారికి రుణపడి ఉంటానని ఆయన అన్నారు. తన విజయం ద్వారానే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డికి బహుమతిగా అందిస్తానని ఆయన ప్రకటించారు. అలాగే తన డివిజన్ లోని ప్రజల ఆశీర్వాదంతో తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం రెండేళ్లలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని ఆయన అన్నారు. డివిజన్ ను సమూలంగా అభివృద్ధి పతన నడిపిస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు ముందు ఉంటానని అన్నారు. ఏళ్ల తరబడిగా పేద ప్రజలకు అందివ్వని రేషన్ కార్డులు కేవలం రెండు సంవత్సరాల లోని అర్హులైన పేదవారి అందరికీ రేషన్ కార్డులతో పాటు, ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందించిందని ఆయన అన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >