| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

News

Posted on 2026-01-27 13:20:03

Share: Share


మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

నామినేషన్ స్వీకరణ జనవరి 28 వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు 

మునిసిపాలిటీలు,  మున్సిపల్ కార్పొరేషన్లకు రెండవ సాధారణ ఎన్నికలు – 2026

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లకు సాధారణ ఎన్నికలు–2026 నిర్వహించేందుకు ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, SP లు, సంబంధిత అధికారులతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంచార్జీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి ACLB మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్ లు నిజామాబాద్ కలెక్టరేట్ నుండి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణ, జెడ్పీ సీఈఓ చందర్ , సంబంధిత జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

ఈ మేరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వచ్చినట్లు తెలియజేయడమైనది.

ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు:

నామినేషన్ల స్వీకరణ ప్రారంభ తేదీ: 28.01.2026 (బుధవారం)

(ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: 30.01.2026 (శుక్రవారం)

(సాయంత్రం 5.00 గంటల వరకు)

నామినేషన్ల పరిశీలన తేదీ: 31.01.2026* (శనివారం)

(ఉదయం 11.00 గంటల నుండి)

చెల్లుబాటు అయ్యే అభ్యర్థుల జాబితా ప్రచురణ: 31.01.2026 (శనివారం)

(పరిశీలన పూర్తయిన వెంటనే)

అప్పీల్ దాఖలు చేసుకునే చివరి తేదీ: 01.02.2026 (ఆదివారం)

(సాయంత్రం 5.00 గంటల వరకు)

అప్పీల్స్ పరిష్కార తేదీ: 02.02.2026 ( సోమవారం)

(సాయంత్రం 5.00 గంటలకు ముందు)

నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ: 03.02.2026 ( మంగళవారం)

(మధ్యాహ్నం 3.00 గంటల వరకు)

తుది అభ్యర్థుల జాబితా ప్రచురణ: 03.02.2026 (మంగళవారం)

(మధ్యాహ్నం 3.00 గంటల తర్వాత)

పోలింగ్ తేదీ: 11.02.2026 (బుధవారం)

(ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు)

రీ-పోల్ (ఉండినట్లయితే): 12.02.2026 (గురువారం)

 ఓట్ల లెక్కింపు తేదీ: 13.02.2026 (శుక్రవారం)

(ఉదయం 8.00 గంటల నుండి)

ఫలితాల ప్రకటన: ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే

ఎన్నికల ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారం ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు , ప్రజలు సంపూర్ణ సహకారం అందించి ఎన్నికలను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సంబంధిత మున్సిపాలిటీలకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన  నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) తక్షణమే అమల్లోకి వచ్చింది.

ఎంసీసీ అమలులో ఉన్న కాలంలో ఎలాంటి ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని, అదేవిధంగా, పట్టణ పరిధిలో ఉన్న అన్ని రాజకీయ బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫోటోలు, ఇతర అభ్యంతరకరమైన ప్రచార సామగ్రిని వెంటనే తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించనైనది.


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >