| Daily భారత్
Logo




వైరా మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది

News

Posted on 2026-01-25 13:31:55

Share: Share


వైరా మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది

సిపిఐ(ఎం),  బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.

వైరా మున్సిపాలిటీలో కలిసి పోటీ చేయనున్న సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు

డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీ ఎన్నికల గురించి గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. త్వరలో జరగనున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీల పొత్తు ఖరారైంది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఆదివారం జరిగిన చర్చల్లో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య ఈ మేరకు అవగాహన కుదిరింది. ఆదివారం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం), బిఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, పట్టణ నాయకులు బొంతు సమత, కొంగర సుధాకర్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు,  వనమా విశ్వేశ్వరరావు, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు మద్దెల రవి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో వైరా మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో బిఆర్ఎస్, సిపిఐ(ఎం) పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ(ఎం), బిఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా ఐక్యంగా సైనికుల్లా పనిచేసి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సిపిఐ(ఎం), బిఆర్ఎస్ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో రానున్న వైరా మున్సిపాలిటీ ఎన్నికలు పోటాపోటీగా జరగనున్నాయి. ఈ సమావేశంలో  బిఆర్ఎస్ నాయకులు మాదినేని దుర్గాప్రసాద్, కొత్త వెంకటేశ్వరరావు, ఏదునూరి శ్రీను, దొంతబోయిన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >
Image 1

ఏపీలో జూనియర్ డాక్టర్ల నిరసనల హోరు...

Posted On 2026-08-10 07:37:01

Readmore >
Image 1

"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"

Posted On 2026-08-10 03:31:22

Readmore >
Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >