Posted on 2026-01-24 06:37:34
డైలీ భారత్ నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులో రూట్ వాచ్ ఆపరేషన్ సమయంలో గంజాయిస్ ముఠా ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యకు అతి దారుణంగా కారుతో ఢీ కొట్టిన సంఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం సుమారు 6:45 గంటల సమయంలో, నిజామాబాద్ పట్టణానికి ఎండుగంజాయి (డ్రై గంజా) తరలింపు జరుగుతోందన్న నమ్మదగిన సమాచారంపై ఆధారపడి, నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సీఐ ) ఆమె సిబ్బందితో కలిసి పట్టణ పరిధిలోని మాధవనగర్ ప్రాంతంలో రూట్ వాచ్ నిర్వహించారు.
ఆపరేషన్ సమయంలో ఒక కారును తనిఖీ కోసం ఆ వాహనాన్ని నిలువరించే ప్రయత్నం చేయగ ఆ వాహనం ఎక్సైజ్ కానిస్టేబుల్ జి. సౌమ్యను ఢీకొట్టింది. దీంతో ఆమె రోడ్డుపై పడిపోయారు. వెంటనే సిబ్బంది ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.
సంఘటన సమాచారం అందిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు. వైద్య పరీక్షల అనంతరం, కానిస్టేబుల్ జి. సౌమ్యకు అంతర్గత పొట్ట గాయాలు అయినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటనను నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించబడింది. సంఘటనకు సంబంధించిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అదనంగా, వాహనం నుంచి సుమారు 2 కిలోగ్రాముల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు.
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >