| Daily భారత్
Logo




రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

News

Posted on 2026-01-23 06:53:01

Share: Share


రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

డైలీ భారత్, కామారెడ్డి:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు–2026ను పురస్కరించుకొని జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మరియు దోమకొండ మండలాల్లోని పలు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ZPHS ఉప్పల్వాయి, ZPHS పోస్సాయణపేట, ZPHS రామారెడ్డి, సోషల్ వెల్ఫేర్ పాఠశాల దోమకొండ మరియు జూనియర్ కళాశాల దోమకొండలో నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు శ్రవణ్, ఇర్షాద్, శంకర్, రఫీ మరియు స్నిగ్ధ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రహదారి భద్రతపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. పాదచారులుగా నడిచే సమయంలో, బస్సులు మరియు ఇతర వాహనాల్లో ప్రయాణించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు సరళమైన భాషలో వివరించారు. అలాగే ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే బాధ్యతాయుతమైన అలవాటు అలవర్చుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సహాయం చేసే గుడ్ సమారిటన్‌లకు ప్రభుత్వం కల్పిస్తున్న చట్టపరమైన రక్షణలు మరియు ప్రోత్సాహకాల గురించి కూడా విద్యార్థులకు వివరించారు. అనంతరం విద్యార్థులతో రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. చిన్న వయసులోనే రహదారి భద్రతపై అవగాహన కల్పిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు.


ఈ కార్యక్రమాల్లో సహాయక మోటార్ వాహనాల తనిఖీ అధికారులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >