| Daily భారత్
Logo




పెరిక సంఘం మూడు తరాలతో తనకు తన కుటుంబానికి సంబంధం ఉండడం అదృష్టంగా భావిస్తున్నా

News

Posted on 2026-01-20 00:58:25

Share: Share


పెరిక సంఘం మూడు తరాలతో తనకు తన కుటుంబానికి సంబంధం ఉండడం అదృష్టంగా భావిస్తున్నా

ఐక్యమత్యంతో ఉండి పేద పెరిక కులస్తులను ఆర్థికంగా ఆదుకోండి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ నగరంలో పెరిక సంఘం ప్రారంభించినప్పటి నుండి తనకు ఎనలేని అనుబంధం ఉందని తాను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగేందుకు అదృష్టంగా భావిస్తున్నానని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. సోమవారం నగరంలోని యేoడల టవర్స్ సమీపంలోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన పెరిక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరిక సంఘంతో తనకు మూడు తరాల తో నాకు సంబంధం ఉందని ఆయన అన్నారు. తన చిన్నప్పటినుండి ఇక్కడ పెరిక సంఘం ఒక చిన్న గదిలో సంఘo అభివృద్ధి కోసం సమావేశాలు నిర్వహించే వారని తన సిడిపి నిధులతో భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. ఇప్పుడు ఆ భవనం అత్యంత సుందరంగా నిర్మించడం జరిగిందని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. నగరంలోని అన్ని కుల సంఘాల కంటే పెరిక సంఘం కుల భవనం ఎంతో గొప్పగా నిర్మించారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ఐక్యమత్యంతో ఉండి మీలో మీకు ఉన్న విభేదాలు వీడి అన్నదమ్ముల్లా ఉండి మీలో ఉన్న పేద కులస్తులను ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని  వారిని కోరారు. ఐక్యమత్యంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అది లోపిస్తే సంఘ అభివృద్ధి అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు. మీరు ఐక్యమత్యంతో ఉంటే రాజకీయ నాయకుల దగ్గరికి మీరు వెళ్లాల్సిన అక్కర్లేదని, తమలాంటి ఆయా రాజకీయ పార్టీ నేతలు మీ దగ్గరికి వచ్చి మీ బాగోగులు ఏంటో తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆయన తేల్చి చెప్పారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >