Posted on 2026-01-19 12:23:10
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) కు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఈరబోయిన నందిని ప్రతిష్ఠాత్మకమైన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై పాఠశాలకే కాకుండా జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
సంగారెడ్డి జిల్లా, కొల్లూరులోని గాడియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో నందిని,గైడ్ టీచర్ తాడూరి సంపత్ కుమార్ మార్గదర్శనం లో తయారు చేసిన వినూత్న ఆవిష్కరణ “స్మార్ట్ రోడ్ కోన్” ను ప్రదర్శించనుంది.
ట్రాఫిక్ సమస్యలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం, వేసవిలో రోడ్లపై పెరిగే ఉష్ణోగ్రతలు వంటి సామాజిక సమస్యలకు పరిష్కారంగా ఈ స్మార్ట్ రోడ్ కోన్ రూపొందించబడింది.
తక్కువ నీటితో రోడ్డు ఉష్ణోగ్రతను తగ్గించడం, ట్రాఫిక్ నియంత్రణలో సహాయపడటం వంటి విశిష్ట లక్షణాలు ఈ ఆవిష్కరణలో ఉన్నాయి.
ఈ నెల 7, 8, 9 తేదీలలో కామారెడ్డిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో నందిని తన ప్రతిభను చాటుతూ ప్రథమ స్థానం సాధించి, దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషం.
ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో దక్షిణ భారతదేశంలోని ఆరు రాష్ట్రాల నుంచి వచ్చిన ఉత్తమ ఆవిష్కరణలతో పాటు నందిని తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించనుంది.
గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఈ స్థాయిలో ప్రతిభ కనబరచడం అభినందనీయం అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం,మరియు గ్రామస్థులు నందినిని మరియు గైడ్ టీచర్ సంపత్ కుమార్‌ను అభినందించడంతో పాటుగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాదించవలిసినదిగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >