| Daily భారత్
Logo




హై క్లాస్ ఏరియాలో లో క్లాస్ చేష్టలు

News

Posted on 2026-01-17 07:05:24

Share: Share


హై క్లాస్ ఏరియాలో లో క్లాస్ చేష్టలు

పేకాట, వ్యభిచారం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన గంగస్థాన్

డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్:  పేరు గొప్ప ఊరు దిబ్బగా మారింది నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని హై క్లాస్ జనాలు ఉండే ప్రాంతం గంగస్థాన్ 1,2,3 లుగా గొప్పగా పిలుచుకునే నిజామాబాద్ నగర వాసులు ఈ ఏరియాలో మాత్రం జరిగేవి అన్ని లోక్లాస్ పనులు. సమయం దొరికితే చాలు కాదు కాదు కాదు. ఈ ప్రాంతంలో ఏ పోలీసులు ఎవరు రారు అనే ధీమాతో  తెగ రేచ్చిపోతున్నారు ఇక్కడి జనాలు. అపార్ట్మెంట్ కల్చర్ పేరిట చిట్టి పార్టీలు, కిట్టి పార్టీలు, గెట్ టుగెదర్ లాంటి పేరు ముసుగులో ఇక్కడ చేయని పనులు లేవు. ముఖ్యంగా పేకాటలు, వ్యభిచారాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. సరిగ్గా ఈ ప్రాంతంపై నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు ఇటీవల కాలంలో చట్టం ముంగిట నిలుపుతున్నారు. గతంలో ఇదే గంగస్థాన్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్లో, అలాగే ఓ నివాస గృహంలో పట్టపగలే అది కూడా మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిన విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. మళ్లీ అదే ప్రాంతంలో ఓ నివాస గృహంలో ఓ మహిళ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిపై కూడా గతంలో కేసు కూడా నమోదు అయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆగకుండా ఇక్కడ యువత రాత్రయితే చాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మలుచుకుంటున్నారు. తాజాగా ఓ అపార్ట్మెంట్లో పేకాట రాయుళ్లు పేకాట ఆడుతూ సిసిఎస్ పోలీసులకు అడ్డంగా దొరికి వారిపై కేసు సైతం నమోదు చేశారు. అయితే ఒకప్పుడు సురక్షిత ప్రాంతంగా పేరొందిన ఈ ఏరియాలో ఇలాంటి ఘటనలు జరగడం పట్ల ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసముంటున్న వాళ్లు వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు. తమ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఏంటి అని తమలో తాము అంతర్మదన పడుతున్నారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >