| Daily భారత్
Logo




ఐకమత్యంతో మున్నూరు కాపు సత్తా చాటుదాం

News

Posted on 2026-01-11 17:37:32

Share: Share


ఐకమత్యంతో మున్నూరు కాపు  సత్తా చాటుదాం

ఏ కష్టం వచ్చినా అండగా ఉంటా

మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలి

డైలీ భారత్, న్యూస్ నిజామాబాద్: ఐకమత్యంతో ఉండి మున్నూరు కాపులా  సత్తా ఏంటో రాజకీయంగా ఆర్థికంగా చాటి చెప్పుదామని మాజీ మేయర్, మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ అన్నారు. ఆదివారం మున్నూరు కాపు జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ నగర్ నుంచి ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఉద్దేశించి ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ..

మున్నూరు కాపులు రాజకీయంగా ఎదగాలని, ఏ కష్టం వచ్చినా జిల్లా కేంద్రంలో నేనున్నానని మర్చిపోవద్దన్నారు. రాజకీయంగా ఎదుగుదలకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ సింహాలు ఉన్నాయని,  ఏ విషయంలోనైనా అండగా ఉంటానన్నారు.
జిల్లాలో 450 పైచిలుకు సర్పంచ్, సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలవడం గొప్ప విషయమని, ఇంతమందిని ఒకే వేదికపై సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. గ్రీన్ కండువాలు ఒకటి ఒకటి ముడివేస్తే నిజామాబాద్ జిల్లాను రావచ్చన్నారు. రాబోవు రోజుల్లో మున్నూరు కాపులతో బ్రహ్మాండంగా సభ నిర్వహించనున్నామని చెప్పకనే చెప్పారు. సన్మాన కార్యక్రమం కోసం ఎంతోమంది శ్రమ దాగిందని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మీ అందరిని ఇలా చూస్తుంటే ఆనాడు ధర్మపురి శ్రీనివాస్ గుర్తొస్తున్నారన్నారు. ఆయన సంఘానికి ఎంతో సేవ చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, గ్రామ మండల, స్థాయిలలో మున్నూరు కాపులు ఏకం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రేలాలే రేల గంగా పాడిన మున్నూరు కాపులము..పాటకు ధర్మపురి సంజయ్ కండువా ఊపి డ్యాన్స్ చేశారు. దీంతో స్టేజ్ మీద ఉన్న అందరూ, కింద ఉన్న వాళ్ళు కండువా ఊపుతూ పాటకు ఊపు తెచ్చారు.

Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >
Image 1

తెలంగాణ రక్షణ సేన పార్టీలో భారీగా చేరికలు

Posted On 2026-07-30 13:04:08

Readmore >
Image 1

ప్రీవెంటివ్ పోలీసింగ్ వైపు కామారెడ్డి పోలీసుల అడుగులు

Posted On 2026-07-30 13:03:09

Readmore >