Posted on 2026-01-11 16:14:02
సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం)ను ఆదరించండి
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
డైలీ భారత్, వైరా:వైరా మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఐ(ఎం) పార్టీ పోటీ చేస్తుందని, రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో వైరా మున్సిపాలిటీలో సిపిఐ(ఎం) పార్టీ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భుక్యా వీరభద్రం కోరారు. వైరా పట్టణ సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ -1, సుందరయ్య నగర్-2, మహిళా శాఖల పరిధిలోని పార్టీ సభ్యులు, ముఖ్యుల జనరల్ బాడీ సమావేశం స్థానిక బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు అద్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడే సిపిఎం పార్టీని ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీలో జరిగిన అవినీతీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో సిపిఎం కృషి చేస్తుందని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, ఇంటి పన్నులు తగ్గించాలని, అన్ని వార్డులలో డ్రైనేజీ, వీధిలైట్లు, అంతర్గత రోడ్లు తదితర స్థానిక సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు గుడిమెట్ల రజిత, షేక్ నాగుల్ పాషా, తోట కృష్ణవేణి, కంసాని మల్లికాంబ, భూక్యా విజయ, మాడపాటి సుజాత, పారుపల్లి చంద్రశేఖర్ బాబు, మందడపు రామారావు, బండారు రామారావు, సంక్రాంతి భాస్కరరావు, మాదినేని శ్రీనివాసరావు, మాడపాటి వెంకటేశ్వరరావు, మాడపాటి రామారావు, దోసపాటి పుల్లయ్య, పూనాటి సూరయ్య తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >