| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మత్తు వ్యసనానికి దూరంగా ఉండాలి

మత్తు వ్యసనానికి దూరంగా ఉండాలి

డైలీ భారత్, హుజూర్ నగర్:గంజాయి, కొకైన్, మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు యువత అందులోనూ విద్యార్థులు దూరంగా ఉండాలని హుజూర్ నగర్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీన్ సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజానికి దిశా నిర్దేశకులు, మంచి సమాజ నిర్మాతలు విద్యార్థినీ విద్యార్థులు, యువకులేనని అటువంటివారు సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆమె కోరారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉన్నా, అమ్మినా, కొనుగోలు చేసినా, సేవించినా, చట్టంలో తీవ్రమైన నేరంగా నిర్దేశించబడినదనీ అటువంటి నేరానికి పాల్పడిన వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నదని, అందువల్ల మాదక ద్రవ్యాలను వినియోగించి విద్యార్థులు తమ బంగారు, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆమె విద్యార్థులకు హితవు చెప్పారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల శారీరక, మానసిక స్థితి తీవ్రంగా దెబ్బతిని అనారోగ్యం పాలై అత్యంత చిన్న వయసులోనే మరణించవలసి వస్తుందని అందువల్ల యువత మాదక ద్రవ్యాల కు దూరంగా ఉండాలని కోరారు. మీకు సమీపంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నట్లుగా మీకు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు ఆ సమాచారాన్ని అందించి మాదక ద్రవ్యాల నిర్మూలనకు విద్యార్థులు నడుం బిగించాలని ఆమె విద్యార్థులకు పిలుపు నిచ్చారు.

Previous మాఖం నరసింహారావును సన్మానించిన పల్లపు వెంకటేశ్వర్లు
Next వికసిత్ భారత్–వికసిత్ గ్రామాలు లక్ష్యంగా గ్రామీణ అభివృద్ధికి విప్లవాత్మక మార్పు చట్టం అమలు
ADVERTISEMENT