Posted on 2025-12-24 16:20:06
డైలీ భారత్ న్యూస్, ఖమ్మం:ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఒక అత్యంత విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో పెన్సిల్ కారణంగా ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే..
నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ తరగతి గదిలోకి వస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.
ఆ సమయంలో బాలుడి చేతిలో ఉన్న పెన్సిల్ నేరుగా ఛాతిలో బలంగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై విహార్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు
ఈ ప్రమాదాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తోటి స్నేహితులతో ఆడుకుంటూ తరగతి గదికి వస్తున్న క్రమంలో జరిగిన ఈ చిన్న ప్రమాదం ప్రాణాంతకం కావడం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో నాయకన్‌గూడెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
Posted On 2026-08-06 18:26:12
Readmore >
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >