Posted on 2025-12-24 19:04:36
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రూప్ల తండాలో జరిగిన అగ్నిప్రమాదం ఓ నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం కొనసాగుతున్న సమయంలో తాత్కాలికంగా ముందు భాగంలో వేసుకున్న రేకుల షెడ్డులో కరెంట్ షాక్ కారణంగా గ్యాస్ అంటుకుని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షెడ్డులో ఉంచిన ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇల్లు కట్టేందుకు సంవత్సరాల కష్టంతో దాచుకున్న రెండు లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు, బట్టలు, కుటుంబానికి చెందిన అన్ని వస్తువులు పూర్తిగా అన్ని వస్తువులుదగ్ధమయ్యాయి. రైతు బజార్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్న భూక్యా లాల్ రోజువారీ మాదిరిగానే ఉపాధి నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం సాధ్యపడలేదు. కళ్లముందే కాలిపోయిన కలలతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో మిగిలింది. సంవత్సరాల కష్టం ఒక్క క్షణంలో బూడిద కావడంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >