Posted on 2025-12-17 16:43:25
డైలీ భారత్ న్యూస్, ఇంటర్నెట్ డెస్క్:ఉబర్, ఓలా, ర్యాపిడో వంటి ప్రైవేటు సంస్థలకు దీటుగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార (కో-ఆపరేటివ్) క్యాబ్ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. "భారత్ ట్యాక్సీ" పేరుతో వస్తున్న ఈ సేవలు వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోతున్నాయి. తొలుత దేశ రాజధాని ఢిల్లీ లో జనవరి 1వ తేదీ నుంచి ఈ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ యాప్ సేవలను దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.
ఇందులో ఆటో, క్యాబ్, బైక్ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ సేవలకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తైనట్లు వెల్లడించింది. ఈ భారత్ ట్యాక్సీ యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. యూజర్లు తమ మొబైల్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదివరకు ఉన్న క్యాబ్ ఛార్జీల నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా.. ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేకుండానే ఈ సేవలను పొందే అవకాశముంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీ యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ సేవల్లో రైడ్ ద్వారా వచ్చే ఆదాయం మొత్తాన్ని (100%) డ్రైవర్లకే చెల్లిస్తారు. అతి తక్కువ నామినల్ రుసుముతో డ్రైవర్లు ఈ ప్లాట్‌ఫాంలో పనిచేయవచ్చు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >