| Daily భారత్
Logo




ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం మనలేవు

News

Posted on 2025-12-15 09:56:33

Share: Share


ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం మనలేవు

కేసీర్ ప్రజల కడుపు నింపితే కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకుంటున్నారు

సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్

డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం పొనుగోడు, గడ్డిపల్లి, కుతుబ్షా పురం గ్రామాలలో హుజూర్ నగర్ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ప్రజాప్రతినిధులు స్థానిక నేతలతో కలిసి సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం  జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరిగిందని కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. కేసీర్ పదేండ్ల లో చేసిన అభివృద్ధి కండ్లముందే కనబడుతుందని తప్ప రెండేళ్ల ప్రజా పాలనలో రూపాయి పని చేసిన పాపానపోలేదన్నారు.  కేసీర్ ప్రవేశపెట్టిన పథకాలనే సక్కగా కొనసాగించ లేని కాంగ్రెస్ పార్టీ ఇంకా కొత్తగా ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరన్నారు.కేసీర్ ప్రజల కడుపు నింపితే కాంగ్రెస్ జేబులు నింపుకునే పనిలో ఉందని ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని అనేకచోట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహావరిస్తున్నారని పలుచోట్ల ఏస్ఐ లు కార్యకర్తలుగా పనిచేస్తున్నారని అమాయకులను స్టేషన్ కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని రౌడీ షీటర్లుగా ఉన్న కాంగ్రెస్ గుండాలను దర్జాగా తిప్పుతున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఎంతో కాలం నిలబడవని రేవంత్ మాయమాటలతో మోసం చేశాడని ప్రజలకు అర్థమైందని కేసీఆర్ ను వదులుకున్నామనే పశ్చాత్తాపం మొదలై బీఆర్ఎస్ నేతలు స్థానిక ఎన్నికల్లో సైనికుల్లా పనిచేస్తున్నారని  మరో రెండేళ్లలో రాబోయేది బీఆర్ఎస్  ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు


Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >
Image 1

కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ

Posted On 2026-08-13 19:55:02

Readmore >
Image 1

హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు... కామారెడ్డిలో POEM సర్జరీతో యశోద కొత్త శకం

Posted On 2026-08-13 19:52:00

Readmore >
Image 1

అమెరికాలో భారత స్వాతంత్ర్య దినోత్సవం

Posted On 2026-08-13 08:23:29

Readmore >
Image 1

ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సాయి కుటుంబాన్ని ఆదుకుంటాం..

Posted On 2026-08-12 21:16:37

Readmore >
Image 1

సిరిసిల్ల షాక్...16 మ్యాక్స్ సొసైటీలను గుప్పిట్లో పెట్టుకున్న పెట్టుబడిదారుడు? బీజేపీ ఫిర్యాదు

Posted On 2026-08-12 10:06:43

Readmore >