| Daily భారత్
Logo




పంచాయతీ ఎన్నికలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి, శాంతియుత వాతావరణంలో నిర్వహణకు చర్యలు తీసుకోవాలి

News

Posted on 2025-12-03 14:14:09

Share: Share


పంచాయతీ ఎన్నికలలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసి, శాంతియుత వాతావరణంలో నిర్వహణకు చర్యలు తీసుకోవాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయిన నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్ పేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ కార్యాలయం మరియు ప్రాధమిక పాఠశాలను పరిశీలించారు. అక్కడ ఎన్నికల సందర్బంగా తీసుకుంటున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సదర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎటువంటి ఆరోపణలకు, అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను అమలు చేస్తు, పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయితీల వాటి ప్రకారం పటిష్టమైన బందోబస్తులు నిర్వహించడం జరుగుతుందని, పోలీస్ సిబ్బందికి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, ఎస్.ఎస్.టి, ఎఫ్.ఎస్.టి ల ప్రకారం అన్ని మండలాల యందు పర్యవేక్షించడం జరుతున్నాయని, సమస్యాత్మకమైనని, అతిసమస్యాత్మకమైనవని ఏర్పాటు చేసి వాటి ప్రకారం బందోబస్తు ఏర్పాట్లు అదేవిదంగా పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రజలందరూ ఎలప్పుడు పోలీసు అధికారులకు సహకరించాలని అన్నారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ శ్రీ సత్యనారాయణ గౌడ్, ఆర్.ఓ శ్రీ డి. సర్సయ్య ఎ.ఆర్.ఓ  శ్రీనివాస్ గౌడ్, సెక్రెటరీ సుఖన్య, ప్రిన్సిపాల్ ఇందిరా సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు

Posted On 2026-07-30 08:32:38

Readmore >
Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >