| Daily భారత్
Logo




ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల బహిరంగ క్షమాపణ చెప్పాలి

News

Posted on 2025-12-03 14:10:31

Share: Share


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల బహిరంగ క్షమాపణ చెప్పాలి

బీజేపీ జిల్లా అధ్యక్షులు, దినేష్ పటేల్ కులాచారి డిమాండ్..

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నిజామాబాదు నగరంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద బుధవారం నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. 

ఈ సందర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి మాట్లాడుతూ...

మొన్న సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలను అవమానించేలా చేసిన వ్యాఖ్యలు క్షమించలేనివని అన్నారు. ఇవన్నీ ఒక వర్గం ఓట్ల కోసం చేస్తున్న రాజకీయ నాటకమని దినేష్ పటేల్ కులాచారి తీవ్రంగా విమర్శించారు. ఒక వర్గం మన్ననలు పొందడానికి హిందువులను బాధించే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ నాయకుల సంప్రదాయమైపోయిందని ఆయన మండిపడ్డారు.

హిందూ దేవతల్ని అవమానించి, తర్వాత రాజకీయ లబ్ధి కోసం మళ్లీ జాగ్రత్తగా నటించడం రేవంత్ స్టైల్ అని, కానీ ఈసారి హిందూ సమాజం మీ నాటకం నమ్మదు అని దినేష్ పటేల్ కులాచారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యత లేకుండా, గౌరవం లేకుండా మాట్లాడటం చూసి రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితే వచ్చింది అని అన్నారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందూ భావాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే, బీజేపీ జిల్లా వ్యాప్తంగా పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసే ధైర్యం మీకు ఎవరు ఇచ్చారు? వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పండి. లేదంటే మీ ప్రభుత్వమే ప్రజల కోపంతో కూలిపోతుందని దినేష్ కులాచారి స్పష్టం చేశారు. హిందూ సమాజాన్ని అవమానించే ఔట్‌డేటెడ్ రాజకీయాలు ఇక పనిచేయవని, ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు అస్సలు సహించరని అన్నారు. మత రాజకీయాల మీద మాట్లాడే కాంగ్రెస్ హిందువులు రేవంత్ ఖాన్ మాట్లాడిన మాటలకూ నోరు లేవడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు? ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఆకుల శ్రీనివాస్, బూరుగుల వినోద్,ఇప్పకాయల కిషోర్,మల్లేష్ గుప్తా, గడ్డం రాజు, అంబదాస్ రావు, గిరిబాబు, యాదల నరేష్, ఆమందు విజయ్ కృష్ణ, ఆనంద్, చిరంజీవి బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు

Posted On 2026-07-30 08:32:38

Readmore >
Image 1

కామన్‌వెల్త్ గేమ్స్‌ : భారత్‌ ఖాతాలో మరో మూడు పతకాలు

Posted On 2026-07-30 06:06:22

Readmore >
Image 1

విశాఖపట్నం : కోటి గాజులతో 89 అడుగుల వినాయకుడి విగ్రహం...

Posted On 2026-07-30 06:05:12

Readmore >
Image 1

జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్

Posted On 2026-07-30 05:57:41

Readmore >
Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >