Posted on 2025-12-02 12:45:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ పరిధిలోని నాగారం డంపింగ్ యార్డ్‌ను మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దండాల్మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బయో-మైనింగ్ ద్వారా శుభ్రపరిచే పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. డంపింగ్ యార్డుల్లో పేరుకుపోయిన చెత్త వల్ల పరిసరాలకు చాలా సమస్యలు వస్తాయి. ఈ చెత్తను తొలగించడానికి బయో-మైనింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. దీనివల్ల పాత చెత్తను వేరు చేసి, శుభ్రపరచి, భూమిని తిరిగి ఉపయోగించుకునేలా చేస్తారన్నారు. మొదట చెత్తపై ప్రత్యేక ద్రావణం పిచికారీ చేసి వాసనలు తగ్గిస్తారన్నారు. తర్వాత ట్రమ్మెల్ యంత్రం ద్వారా చెత్తను మూడు భాగాలుగా వేరు చేస్తారు-ఎరువుగా ఉపయోగించే భాగం, కట్టడ పనులకు పనికొచ్చే భాగం, ఫ్యాక్టరీల కోసం ఇంధనంగా ఉపయోగించే ఆర్డిఎఫ్ మొత్తం 3,51,500 మెట్రిక్ టన్నుల చెత్తను శుద్ధి చేసే ప్రక్రియ త్వరలోనే పూర్తి అవుతుందని అధికారులు వివరించారు.
ప్రస్తుతం 2 మిషిన్లు పనిచేస్తుండగా, అదనంగా మరో 2 మిషిన్లు అవసరం పడతాయి అవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్యలతో ప్రాంతం శుభ్రపడి, నాగారం డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందన్నారు. శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఇందూర్ నగరాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని,ఆ దిశగా పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >
వందేమాతరం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం... జాతీయ గీతంతో సమానంగా చట్టపరమైన రక్షణ
Posted On 2026-07-30 12:57:14
Readmore >
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >