డైలీ భారత్, పెద్దపల్లి : పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని బస్టాండ్ నుఁడి మంచిర్యాల వైపు వెళుతున్న ట్రక్కుఈరోజు ఉదయం బీభత్సం సృష్టించింది.
చెత్త సేకరణ కోసం వచ్చిన వాహనాన్ని ఢీ కొట్టి పలు వాహనాలను కూడ ట్రక్కు ఢీకొట్టింది. వాహనాలను ఢీకొన్న తరువాత టిఫిన్ సెంటర్‌లోకి ట్రక్కు దూసు కెళ్లింది.
ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసంకాగా భయంతో ప్రజలు పరుగులు తీశారు. ప్రమాదంలో చెత్త సేకరణ వాహన డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. ఈ సంఘటనకు సంబం ధించిన వివరాలు తెలియ వలసి ఉంది.