డైలీ భారత్, తిరుపతి : తిరుమల తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని 16 నెంబరు మూలమలుపు వద్ద ఈరోజు ఉదయం ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సు డీ కొట్టిన సంఘటనలో మహిళ మృతి చెందింది.
మృతురాలు గుంటూరు జిల్లా మాచర్ల ఎర్రగడ వీధికి చెందిన దాసరి జ్యోతి గా పోలీసులు గుర్తించారు.
ఈరోజు తిరుమల నుండి తిరుపతికి ద్విచక్ర వాహ నంలో త్రిబుల్ రైడింగ్ తో వస్తుండగా 16 మలుపు వద్ద బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం.జరిగినట్టు తెలిసింది.
తీవ్ర గాయాలైన జ్యోతి అనే మహిళ ను స్విమ్స్ ఆసుపత్రికి తరలించ గా.పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు.
మృతదేహాన్ని స్విమ్స్ ఆసుపత్రి నుండి రుయా మార్చురీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.