| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

యువకుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క

యువకుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణకు వలస వచ్చిన జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ గత కొంతకాలంగా రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నివాసం ఉంటున్నారు.

అయితే వారిద్దరు నిన్న రాత్రి చికెన్ తీసుకువచ్చి దావత్ చేసుకోవాలను కున్నారు. ఇందుకు అనుగుణంగా ఇద్దరు ఏర్పాట్లు చేసుకు న్నారు. చికెన్‌తో పాటు నంజుకో వడానికి పూరి కూడా వండుకున్నారు.

అందులోకి మద్యం కూడా తీసుకొచ్చారు. అయితే హ్యాపీగా పార్టీని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది.

మద్యం సేవించి ఇద్దరు భోజనం చేస్తుండగా జితేంద్రకుమార్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో ఏమో అని తేరుకునేలోపే ధర్మేందర్ అపస్మారకస్థితికి చేరుకున్నాడు.

కాసేపటికి అతన్ని గమనించిన ధర్మేందర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ధర్మేందర్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. గొంతులో చికెన్ ముక్క ఇరుక్కోవ డంతో మృతి చెందినట్లు వైద్యులు తేల్చే చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు..

Previous పెండింగ్ చాలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్
Next వడ్డే ఓబన్న పోరాటం మరువలేనిది: నీలం మధు ముదిరాజ్..
ADVERTISEMENT