| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పెండింగ్ చాలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్

పెండింగ్ చాలాన్ల గడువు పొడిగించిన రేవంత్ రెడ్డి సర్కార్

డైలీ భారత్, హైదరాబాద్‌:రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు చెల్లింపు గడువును ఈ నెల 31 వరకు పెంచారు. ముందుగా ప్రకటించిన ప్రకారం బుధవారంతో గడువు ముగిసింది.

వాహన యజమానుల నుంచి స్పందన చూసి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో గడువు పొడి గించినట్టు పోలీసు అధికా రులు తెలిపారు.

ఈ అవకాశాన్ని వాహన యజమానులు సద్విని యోగం చేసుకొని పెండింగ్‌ చలాన్లు మొత్తం చెల్లించాల ని కోరారు.

టూ, త్రీ వీలర్‌ వాహనాల చలాన్లపై 80 శాతం రాయి తీ, ఆర్‌టీసీ బస్సులపై 90 శాతం, లైట్‌, హెవీ వెహి కిల్స్‌పై 60 శాతం రాయితీ ఇస్తున్నారు.

వాహనదారు లు పెండింగ్‌ చలాన్ల వివరాలను www. echallan.tspolice.gov.in/ pu blicviewలో చూసి, చెల్లించాలని సూచించారు.

చలాన్లను మీ సేవా, టీ వాలెట్‌, ఈ సేవా, ఆన్‌లైన్‌, పేటీం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా చెల్లించవచ్చని వెల్లడించారు. చలాన్ల రాయితీ ద్వారా ఇప్పటి వరకు ప్రభుత్వానికి రూ.113 కోట్ల ఆదాయం వచ్చింది.

పెండింగ్‌ చలాన్లు 3.59 కోట్లు ఉండగా, ఇప్పటి వరకు 1.29 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు.

Previous బొలెరో వాహనం ఢీకొని ఎద్దులు మృతి
Next యువకుడి ప్రాణం తీసిన చికెన్ ముక్క
ADVERTISEMENT