| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

ఆగి ఉన్న స్కూల్ బస్సును ఢీకొన్న లారీ

విద్యార్థులకు తృటి లో తప్పిన పెను ప్రమాదం

స్వల్ప గాయాలతో బయటపడ్డ విద్యార్థులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మక్లూరు మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఆగి ఉన్న ఓ స్కూల్ బస్సును అదే దారి గుండా వెళ్తున్న లారీ ఢీకొండం ఘటన కలకలం రేపింది. ఇదే మండలానికి చెందిన చిక్లీ గ్రామ శివారులో ఉంది ఓ ప్రైవేట్ విద్యా సంస్థ బ్రిలియంట్ స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల బస్సు విద్యార్థులను దించే క్రమంలో బస్సు ఎడమవైపు నిలిపి ఉంచారు ఆ బస్సు డ్రైవర్ వెంటనే ఆ వెనకాలనే వస్తున్న వడ్ల లారీ లోడుతో ఉన్న లారీ బస్సును ఢీకొనడంతో అందులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెనుక భాగం పూర్తిగా దెబ్బ తినడంతో అందులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. తృటిలో జరిగిన ఈ ప్రమాదం లో విద్యార్థులకు తీవ్ర గాయాలు అయి ఉంటే ఆస్పత్రుల పాలు కావాల్సి వచ్చేది. కాగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో బస్సును ఢీ కొట్టారని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే లారీ డ్రైవర్ ను కిందకు దింపి పోలీసులకు అప్పగించినట్లు సమాచారం.

Previous మైనర్ బాలిక పై లైంగిక దాడికి ప్రయత్నించిన నిందితుడు అరెస్ట్ & రిమాండ్ తరలింపు : సుజాతనగర్ ఎస్సై రమాదేవి
Next సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్ షాప్, లాడ్జీ లలో పోలీసు నార్కోటిక్ జాగిలాలతో ఆకస్మిక తనిఖీలు
ADVERTISEMENT