Posted on 2025-11-03 14:52:48
డైలీ భారత్, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ సాగర్ చెరువు కట్ట వద్ద సందీప్ అనే ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. నారాయణఖేడ్ నియోజకవర్గం, కల్హేర్‌కు చెందిన సందీప్.. గత ఒక సంవత్సరం నుంచి సంగారెడ్డి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ సందీప్ ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
అయితే.. ఈ ఆత్మహత్యకు సంబంధించిన ప్రధాన అనుమానం ఒకటి వెలుగులోకి వచ్చింది. సందీప్ ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై.. ఆ క్రమంలో భారీగా డబ్బులు పోగొట్టుకోవడం వల్లే ఈ కఠినమైన నిర్ణయం తీసుకుని ఉంటాడని స్థానిక వర్గాలు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా ఆర్ధికంగా నష్టపోయి.. ఆ ఇబ్బందులను తట్టుకోలేకనే అతను తన వద్ద ఉన్న తుపాకీని ఉపయోగించి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు సమాచారం అందుకుని.. ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరణానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కేసు వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కేవలం వారం రోజుల క్రితమే.. కామారెడ్డిలో కూడా ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న జీవన్‌రెడ్డి, పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్‌రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >