| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

“మాలల రణబేరి మహాసభ” ఏర్పాట్లను సమీక్షించిన జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య

“మాలల రణబేరి మహాసభ” ఏర్పాట్లను సమీక్షించిన జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య

డైలీ భారత్, హైదరాబాద్: నవంబర్ 23న జరగబోయే “మాలల రణబేరి మహాసభ” ఏర్పాట్లను జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నవంబర్ 23న జరగబోయే మాలల రణభేరి మహాసభపార్కింగ్, సభా వేదిక, స్టేజ్ మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు సరూర్‌నగర్ సభా ప్రాంగణ గ్రౌండ్‌ను సందర్శించారు

సభ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణపై ఎల్‌బి నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి తో చర్చలు జరిపారు.సభకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర కమిటీతో సమగ్రంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జై ఈథారులు తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు

Previous పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన ప్రమోద్ పై నిజానిర్ధారణ కమిటీ చేస్తున్న ఆరోపణలు అసత్యం
Next భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత
ADVERTISEMENT