Posted on 2025-11-02 17:06:00
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మానవత్వం మరుస్తున్న సమాజంలో ఈ ఘటన అందరినీ చలింపజేస్తుంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో లేగ దూడ మృతి చెందగా తల్లి ఆవుతో పాటు మిగతా గోవులు అంత్య క్రియలకు కలిసి నడిచాయి. గ్రామంలోని రామాలయానికి చెందిన లేగ దూడను కుక్క కాటు వేయడంతో రేబిస్ వ్యాధితో మృతి చెందింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దూడకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎడ్ల బండిపై తరలిస్తుండగా పలు గోవులు వెనుక వెళ్లిన ఈ దృశ్యం స్థానికంగా కంటతడి పెట్టించింది. ఏమీ తెలియని మూగజీవాలు సైతం తమ తోటి లేగ దూడ మృతి చెందిందని సమాజంలో మనుషుల్లాగా కల్మషాలు, ఈర్ష్య, ద్వేషాలు పెట్టుకోకుండా వాటిని చూసేనా మనసుల్లో కొద్దిగైనా ప్రవర్తన మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కామారెడ్డి జిల్లాలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-05-26 08:13:24
Readmore >
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >