| Daily భారత్
Logo




సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

News

Posted on 2025-11-01 15:26:11

Share: Share


సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ఉద్బోదించారు. ప్రపంచంలోనే సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ లు ముందున్నాయని ఆయన పేర్కొన్నారు.

నిజామాబాదు రీజియన్ లోని లయన్స్ క్లబ్ లలో నూతనంగా చేరిన సభ్యులకు శనివారం నిజామాబాదు నగరంలోని కపిల హోటల్ కాన్పరెన్స్ హాల్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా రెండవ ఉప గవర్నర్ డి.నర్సింహరాజు ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ లు ముందుకు సాగుతున్నాయన్నారు..లయనిజంలో కొనసాగుతున్న వారు కొత్తగా చేరుతున్న వారు నిస్వార్దంగా సేవలందిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ లాంటి స్వచ్చంద సంస్థల్లో చేరి సేవా కార్యక్రమాలు చేపట్టడం‌ ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని అన్నారు. కొత్తగా లయనిజంలో చేరిన వారి వల్ల లయన్స్ సేవలు మరింత విసృతమవుతాయన్నారు..ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా జీఎస్టీ కో ఆర్డినేటర్ రాంమనోహర్, జీఎల్టీ కో ఆర్డినేటర్ టి.పద్మావతి, నిజామాబాదు రీజియన్ చైర్మెన్ సూర్యభగవాన్, కో ఆర్డినేటర్ నాగేశ్వరరావు, జిల్లా చైర్మెన్ డి.యాదగిరి, జోన్ చైర్మెన్ నర్సింహరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >