Posted on 2025-11-01 15:23:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు నగరం నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు మహా పాదయాత్రకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “భక్తి, నియమ నిష్టలు మన భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక పునాది లాంటివని అన్నారు. నిజామాబాద్ నుండి కేరళ వరకు జరుగుతున్న మహా పాదయాత్ర అనేది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు — అది ఆంతరిక సాధన, ఆత్మీయ మార్గం. ఇలాంటి పాదయాత్రలు యువతలో ధార్మిక చైతన్యాన్ని, నియమశీలతను పెంపొందించడంతో పాటు, సమాజంలో ఐక్యతను బలపరుస్తాయన్నారు. అయ్యప్ప స్వామి భక్తుల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసే శక్తి, ప్రసాదించాలని ఆ మణికంఠుడిని ప్రార్థిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. ఈ మహా పాదయాత్రలో పురంశెట్టి నంద కిషోర్, నూరు రాజేందర్, వేణు, సాయిరెడ్డి, సుధాకర్, దీపక్, గంగా ప్రసాద్ తదితర భక్తులు పాల్గొంటున్నారన్నారు. వీరందరూ శబరిమల స్వామి దర్శనం కోసం నిజామాబాద్ నుంచి సుమారు 1500 కి.మీ. దూరాన్ని పాదయాత్రగా పూర్తి చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రజా ప్రతినిధులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >