డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మైనర్ బాలికపై అత్యాచార కేసులో కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాచారెడ్డి పీఎస్ పరిధిలో దాడికి పాల్పడిన నిందితుడు భూక్యా గణేశ్ కు జిల్లా జడ్జి సిహెచ్ వర ప్రసాద్ యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.30 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. విదేశాలకు పారిపోయినా నిందితుడు చట్టం నుంచి తప్పించుకోలేడని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పోలీసు అధికారులు, దర్యాప్తు బృందాన్ని ఎస్పీ అభినందించారు.
News
బాలికపై అఘాయిత్యం.. కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు