| Daily భారత్
Logo




నవిపేట జ్యువలరీ దుకాణంలో భారీ దొంగతనం

News

Posted on 2025-10-27 12:47:56

Share: Share


నవిపేట జ్యువలరీ దుకాణంలో భారీ దొంగతనం

20 లక్షల విలువ చేసే  బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నవీపేట్ మండల కేంద్రంలోని బంగారు దుకాణంలో  భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో దాదాపు  20 లక్షల రూపాయల విలువ చేసే  బంగారం, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నవీపేట్ మండల కేంద్రంలోని  వైష్ణవి జువెలరీ షాప్ సెట్టర్ ను దొంగలు గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. అందులో ఉన్న బంగారం తో పాటు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం షాప్ యజమాని  అక్కడికి చేరుకోగా  సెట్టర్ ధ్వంసం చేసి ఉండడంతో చోరీ  జరిగినట్లు భావించి వెంటనే నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ ను రప్పించి  చోరీకి పాల్పడ్డ వారి వేలిముద్రలు సేకరించారు. పోరుగునే ఉన్న మహారాష్ట్రకు చెందిన  దొంగల గ్యాంగ్ గా  పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.

Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >
Image 1

హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ "సామాజిక న్యాయ తెలంగాణ – సంకల్ప సభ"

Posted On 2026-08-03 14:09:30

Readmore >
Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >