ఖబర్దార్ అరవింద్ పసుపు రైతులను మోసం నీకు సరైన గుణపాఠం చెప్తాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చేపడుతున్న జనం బాట కార్యక్రమానికి ఆర్మూర్ కు చెందిన పసుపు రైతులు కవితమ్మకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆనాడు పసుపు రైతులను కాపాడుతాము, ఫస్ట్ బోర్డు తెస్తామని వల్లమాలిన మాటలు చెప్పి పసుపు రైతులను మోసం చేసిన అరవింద్ రాజకీయ సమాధి తప్పదని పసుపు రైతులు మండిపడ్డారు. దశాబ్ద కాలంలో ఎంపీ అరవింద్ పసుపు రైతులకు చేసింది శూన్యమని ఇకపై తాము మాజీ ఎంపీ కవిత చేపడుతున్న ధర్మా పోరాటంలో నిలబడి కవితకు మద్దతుగా నిలుస్తూ ఆమె అడుగుజాడ లోనే నడుస్తామని ఆర్మూర్ కు చెందిన పసుపు రైతు నవీన్ రెడ్డి స్పష్టం చేశారు.