| Daily భారత్
Logo




ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

News

Posted on 2025-10-22 17:10:02

Share: Share


ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందల్వాయి మండలం వెంగల్ పాడ్, తాటితండా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మాట్లాడుతూ   రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం విక్రయించుకునేలా అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి, ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత  మహిళలకు పెద్దపీట వేస్తుందని, నిజామాబాద్ జిల్లాలో గత ధాన్యం కొనుగోలు  ఐకెపి ఆధ్వర్యంలో 100 సెంటర్ ఇస్తే, ప్రస్తుతం 200 ధాన్యం కొనుగోలు ఐకెపి కేంద్రాలకు అప్పజెప్పిందని అన్నారు. గత ధాన్యం కొనుగోలు ఐకెపి మహిళలకు కోటి రూపాయల  లాభం వచ్చిందని అన్నారు, 200 ఐకెపి సెంటర్ల వల్ల  ఐకెపి మహిళలకు సుమారు  రెండు కోట్ల లాభం వస్తుందని అంచనా వేశారు. సిఎం రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వర్లుగా చేయడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. రైతులు ఇచ్చిన ధాన్యానికి రసీదు కచ్చితంగా ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎటువంటి అవకతవకలు జరగకూడదని  ఐకెపి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, చింతల కిషన్, లింగాపూర్ సంతోష్ రెడ్డి, రాయసింగ్, పరశురాం నాయక్, ఐకెపి సిబ్బంది, రైతులు తదితరులు   పాల్గొన్నారు.

Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 21:54:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >