Posted on 2025-10-22 13:02:42
విద్యార్థినితో పరారైన వైనం - సిరిసిల్లలో చర్చనీయాంశం..!
డైలీ భారత్,రాజన్న సిరిసిల్లజిల్లా: విద్యా బుద్ధులు నేర్పిన గురువే.. ప్రేమ పాఠాలు చెప్పాడు.. సభ్య సమాజం.. చదువు సంస్కారం నేర్పించాల్సిన వాడే.. వక్ర మార్గం వైపు నడిపించాడు.. సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు.. ఇంటర్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పని చేసే ఓ గురువు.. డిగ్రీ చదువుతున్న విద్యార్థినితో పరారైన ఉదంతం రాజన్న జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రిన్సిపాల్ నిర్వాకంపై సిరిసిల్ల ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తమ కళాశాలలో విద్యనభ్యసించే ఓ విద్యార్థినితో కొంతకాలంగా చనువుగా ఉంటూ వచ్చాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటుంది. గతంలో ఇంటర్ సమయంలోనే విద్యార్థినినీ ప్రలోభపరిచిన అధ్యాపకుడు ఈసారి ఏకంగా ఆమెతో కలిసి గత రెండు రోజుల క్రితం అదృష్టమైనట్టు సమాచారం. ప్రిన్సిపల్, విద్యార్థిని ఇద్దరూ కనిపించకుండా పోయిన ఘటన జిల్లా వ్యాప్తంతగా సంచలనం రేపుతోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు, కళాశాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ప్రజలు కోరుతున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >