| Daily భారత్
Logo




రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విషయంలో విచారణ చేపడతాం

News

Posted on 2025-10-21 19:47:29

Share: Share


రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విషయంలో  విచారణ చేపడతాం

ప్రమోద్ కుటుంబానికి సీఎం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా

డీజీపీ శివధర్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:పోలీసు శాఖలో విధి నిర్వహణలో భాగంగా జరిగిన రియాజ్ ఎన్ కౌంటర్ పై పోలీసు శాఖ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో డీజీపీ విలేకరులతో మాట్లాడుతూ ప్రమోద్ కుటుంబానికి పోలీసు శాఖ తరపున సానుభూతి ప్రకటించారు. ప్రమోద్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడంతో ఆయన కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారని, వాటిని కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల స్థలం ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ ఎన్ కౌంటర్ కేసు విచారణ జరుగుతుందన్నారు. విచారణ బాధ్యతలను పొరుగు జిల్లా అధికారికి అప్పగించినట్లు డీజీపీ పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన 65 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. మావోయిస్టులు నిర్భయంగా లొంగిపోవాలని కోరారు. పోలీసు, రెవెన్యూ, మీడియా ఆధ్వర్యంలోనూ వారు లొంగిపోయినా ప్రభుత్వం తరపున అందజేయాల్సిన రివార్డును అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దండకారణ్యంలో పని చేస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డీఐజీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీసు కమిషనర్ సాయిచైతన్యలు పాల్గొన్నారు.

Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 08:04:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 19:39:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 19:32:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 19:30:41

Readmore >
Image 1

కాలినడక ద్వారా తిరుమలకు చేరిన 116 ఏళ్ల వృద్ధురాలు

Posted On 2026-07-05 17:09:50

Readmore >
Image 1

ఒవైసీ కాలేజ్ నిర్మాణాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్!!

Posted On 2026-07-05 17:08:44

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో విషాదం... రైలు ఢీకొని నలుగురి మృతి

Posted On 2026-07-05 11:44:43

Readmore >
Image 1

సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...

Posted On 2026-07-04 16:57:14

Readmore >
Image 1

ఆహార కల్తీపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం!

Posted On 2026-07-04 15:07:29

Readmore >
Image 1

అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-07-04 14:03:34

Readmore >