డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కప్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హుసాముద్దీన్ గోల్డ్ మెడల్ సాధించాడు. ఇంటర్నేషనల్ బాక్సర్, అర్జున అవార్డు గ్రహీత మహమ్మద్ హుసాముద్దీన్ తమిళనాడులోని చెన్నైలో జరిగిన బీ ఎఫ్ ఐ కప్ ఛాంపియన్షిప్లో 55- 60 కేజీల వ్యక్తిగత శరీర బరువు కేటగిరీలో పోటీపడ్డాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న హుసాముద్దీన్ తాజాగా స్వర్ణం సొంతం చేసుకున్నాడు.
News
బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంపియన్షిప్ లో నిజామాబాద్ యువకుడికి స్వర్ణ పతకం