Posted on 2025-09-30 07:12:49
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ బతుకమ్మ సంబరాలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను సొంతం చేసుకున్నాయి. ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించి చరిత్ర సృష్టించాయి. హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో మహా బతుకమ్మ కార్యక్రమాన్ని అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కోసం 10 వేల మందితో బతుకమ్మ వేడుకను అధికారులు చేపట్టారు. మహా బతుకమ్మ దగ్గర గిన్నిస్ బుక్ రికార్డు సభ్యుల పర్యవేక్షణ చేశారు. ఈ నేపథ్యంలో మహా బతుకమ్మ కార్యక్రమం ఏకంగా రెండు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది. అతిపెద్ద జానపద నృత్యంగా తెలంగాణ బతుకమ్మ ఒక గిన్నిస్ రికార్డు సాధించింది. మరో రికార్డుగా 66.5 అడుగుల భారీ బతుకమ్మ చుట్టూ ఒకేసారి 1,354 మంది మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆడి మరో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారు.
ఈ మేరకు తెలంగాణ బతుకమ్మ వేడుకకు 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి బతుకమ్మ వేడుక నమోదైంది. పది వేల మంది మహిళలు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ.. పాటలు పాడుతుండగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు వివరాలను నమోదు చేసుకుని ఫలితాన్ని ప్రకటించారు. ఒకేసారి పది వేల మందితో బతుకమ్మ ఆడించి గిన్నిస్ రికార్డుల్లో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా మహా బతుకమ్మ కార్యక్రమం కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ మేరకు అధికారుల అంచనాలను మించి మహా బత్తుకమ్మ రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది..
మెదడు చికిత్సలు మరింత సులభం : సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బీజే రాజేష్
Posted On 2026-07-02 17:57:45
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : వేయించిన పల్లీల్లో పెండల పురుగు..
Posted On 2026-07-02 17:51:43
Readmore >
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-07-02 17:42:33
Readmore >
ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలి.. ప్రభుత్వం ఆదేశాలు
Posted On 2026-07-02 12:30:41
Readmore >
దళిత అవార్డు అందుకున్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్యకు సన్మాన మహోత్సవం
Posted On 2026-07-01 17:28:05
Readmore >
"సిరిసిల్లలో కలకలం : బాలాజీ స్వీట్ షాప్ మిక్చర్‌లో బల్లి, యజమానిపై కేసు నమోదు"
Posted On 2026-07-01 07:14:21
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ మోసం బట్టబయలు : తల్లి అరెస్ట్, కొడుకు కోసం గాలింపు
Posted On 2026-06-30 18:35:12
Readmore >