| Daily భారత్
Logo




టీపీసీసీ మాజీ అధ్యక్షుడు దివంగత డి. శ్రీనివాస్ కు నివాళ్ళు అర్పించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

News

Posted on 2025-09-27 15:41:50

Share: Share


టీపీసీసీ మాజీ అధ్యక్షుడు దివంగత డి. శ్రీనివాస్ కు నివాళ్ళు అర్పించిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి

కొండా లక్ష్మణ్ బాపూజీ  కి ఘన నివాళులు అర్పించిన రూరల్ ఎమ్మెల్యే..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ ప్రదేశ్ కమిటీ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ జయంతి సందర్భంగా ధర్మపురి నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి నిజాంబాద్ నగరంలోని  కంటేశ్వర్ బైపాస్ లో గల ధర్మపురి శ్రీనివాస్ విగ్రహానికి  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్  రాజ్యసభ సభ్యునిగా మాజీ మంత్రిగా పిసిసి అధ్యక్షునిగా ఎన్నో ఉన్నత పదవులు చేశారని, రెండు పర్యాయాలు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికరణ తీసుకువచ్చిన ఘనత డి శ్రీనివాస్ దే అన్నారు. డి శ్రీనివాస్ ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేయాలని  కార్యకర్తలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని నిజాంబాద్ జిల్లాలో ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత డి శ్రీనివాస్ దేని కొనియాడారు. అనంతరం  వినాయక్ నగర్ లో గల ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతి సందర్బంగా పూల మాల వేసి నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఎలా పోరడు అన్న విషయాన్నీ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కొనియాడారు. ఈ సందర్బంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ వంకిడి గ్రామంలో జన్మించి స్వాతంత్రo కోసం పోరాటం చేశారన్నారు. ఆసిఫాబాద్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సాధనకై తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తన స్థలాన్ని కేటాయించి వాటర్ హౌస్ గా మార్చారు. అయన ఆశయాలను ప్రతి ఒక్క పౌరుడు ఆచరిస్తూ ముందుకు సాగాలి అని కొనియాడారు. కార్యక్రమం లో డీసీసీ జిల్లా అధ్యక్షులు మనలా మోహన్ రెడ్డి,ఎఏంసి చైర్మన్ ముప్పా గంగాధర్,డిచిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతపూర్ గంగాధర్, మాజీ ఎంపీపీ యాదగిరి నాయక్, పద్మశాలి నగర అధ్యక్షులు పెంటూ దత్తద్రి, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >
Image 1

G.O 25 రద్దు చేయాలి, CPS రద్దు చేసి OPS అమలు చేయాలి: TPTF

Posted On 2026-08-01 16:59:26

Readmore >
Image 1

జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్

Posted On 2026-08-01 16:47:06

Readmore >
Image 1

సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన

Posted On 2026-08-01 15:52:51

Readmore >
Image 1

కామారెడ్డి ట్రాఫిక్ అవుట్‌పోస్ట్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-08-01 15:46:07

Readmore >
Image 1

జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్

Posted On 2026-08-01 15:44:11

Readmore >