Posted on 2025-09-26 14:02:20
చాకలి ఐలమ్మ నేటి తరం మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గారు హాజరయ్యారు.ఈ సందర్బంగా బిజెపి ఓబీసీ మోర్చా నాయకులతో కలిసి వినాయక్ నగర్ విగ్రహాల పార్క్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు బడుగు, బలహీన వర్గాల ప్రజలను వెట్టిచాకిరీ చేపిస్తు బానిసలుగా చూస్తున్న రోజుల్లో చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విస్నూర్ దేశ్ మఖ్ ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత సాకాలి ఐలమ్మ అని అన్నారు. రాణి రుద్రమ్మ పౌరుషన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దు బిడ్డ సాకాలి ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొర గుండాలు అక్రమంగా తీసుకెళ్తుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికెల చేసిందన్నారు. సాకాలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శం అని ఆడది అంటే అభల కాదు ఆది పరశక్తి అని రుజువు చేసిన దీర మహిళా సాకాలి ఐలమ్మ అన్నారు. ఆడవాళ్లు అంటే వంటింటి కుందేళ్లు అనుకునే సమాజంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్ తెచ్చి యావత్ మహిళా లోకాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయే లక్ష్యంతో బిజెపి పనిచేస్తుందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో ఇద్దరే మహిళలు ఖురేషి, వ్యోమిక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి భారతీయ మహిళా నారీ శక్తి అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించారని అన్నారు. నేటి తరం మహిళలు చాకలి ఐలమ్మ, రాణి రుద్రమ్మ, ఝాన్సీ లక్ష్మి భాయ్ లాంటి వీర వనితల పోరాట స్ఫూర్తితో వారిని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అవరోదించాలని సూచించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు స్వామి యాదవ్, గిరి బాబు, నాగరాజు, బుస్సాపూర్ శంకర్ బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
Posted On 2026-07-28 08:06:38
Readmore >
అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు
Posted On 2026-07-28 08:04:20
Readmore >
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >