Posted on 2025-09-25 04:51:06
డైలీ భారత్, హైదరాబాద్: తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరు మార్చే అంశానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి సెక్రటేరియట్ వరకు కలిపే వంతెన పేరు మార్చాలని బుధవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయించారు.
లోయర్ ట్యాంక్ బండ్ నుండి సెక్రటేరియట్ వరకు కనెక్ట్ చేసే ఫ్లైఓవర్ కు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం కార్పొరేషన్‌కు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశం ఆమోదించింది.నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం స్టాండింగ్ కమిటీ సమావేశం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూం లో జరిగింది. కమిటీ సమావేశంలో 14 ఎజెండా అంశాలు, 10 టేబుల్ ఐటమ్ లకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్టార్మ్ వాటర్ డ్రెయిన్ (ఆర్‌సిసిబాక్స్ డ్రెయిన్) నిర్మాణం సాయి నగర్ ఆర్చ్ నుండి టి.ఐ.ఎఫ్.ఆర్ కాంపౌండ్ వాల్ కల్వర్ట్ వరకు, వార్డు నం.3లోని కృష్ణారెడ్డి నగర్ రోడ్ నం.1, రోడ్డు నం.2, కాప్రా సర్కిల్, చర్లపల్లి లో రూ.285.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించేందుకు కార్పొరేషన్‌కు సిఫార్సు పరిపాలన ఆమోదం కోరబడింది. సీసీ రోడ్డు నిర్మాణం అల్వల్ సర్కిల్ వార్డు నం.133లో హై టెన్షన్ లైన్ మార్గంలో వి.బి.ఆర్ గార్డెన్స్ నుండి ఎస్.ఎన్. రెడ్డి ఎన్ క్లేవ్ వరకు 2025-26 ఆర్థిక సంవత్సర నిధులు రూ.450.00 లక్షల వ్యయంతో సిసి రోడ్డు నిర్మణానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి.
కాప్రా సర్కిల్ వార్డు నం. 2 లో భవాని నగర్ నుండి బావి బజార్ నాలా మీదుగా ఇ.టి.డి.సి నార్త్ కమలా నగర్ నాలా వరకు రూ.395.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్‌సిసి బాక్స్ డ్రెయిన్ నిర్మాణానికి కార్పొరేషన్‌కు సిఫార్సు పరిపాలన ఆమోదించారు. మల్కాజిగిరి సర్కిల్, డివిజన్ 136లో ఆర్‌కే పురం ఫ్లైఓవర్ కింద స్పోరట్స్ జోన్ ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను అనుభవజ్ఞులైన ఏజెన్సీకి అప్పగించేందుకు ఆమోదించారు. మూసాపేటలోని కెపిహెచ్‌బి మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో వివిధ స్పోరట్స్ కార్యకాలపాలకు యూజర్ చార్జీలు ఫిక్స్ చేయడం కోసం ఆమోదం కొరకు సమర్పణ. బండ్లగూడ మల్టీపర్పస్ స్పోరట్స్ స్టేడియంలో అవుట్‌సోర్సింగ్ విధానంలో ఉద్యోగుల నియామకానికి అనుమతి కోరబడింది. జీహెచ్‌ఎంసీ అవుట్‌సోర్సింగ్/ స్వయం సహాయక సంఘాల వర్కర్ల జీత ఖాతాలను ప్రైవేట్ బ్యాంకులో ప్రారంభించడానికి ప్రతిపాదన స్టాండింగ్ కమిటీ ముందు సమర్పించారు. క్రింది అంశాలపై ఆమోదం కోరబడింది. తద్వారా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మరియు టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లబ్ది కలిగేలా చూడాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జీహెచ్‌ఎంసీ కమీషనర్ ఆర్.వి కర్ణన్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం
Posted On 2026-09-01 17:18:53
Readmore >
రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు
Posted On 2026-09-01 16:34:15
Readmore >
జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి
Posted On 2026-09-01 16:30:44
Readmore >
కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు
Posted On 2026-09-01 15:32:20
Readmore >
సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు
Posted On 2026-09-01 11:18:42
Readmore >
ప్రభుత్వ స్పందనపై మండిపడ్డ బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-09-01 09:34:38
Readmore >