| Daily భారత్
Logo




భాష రాకున్నా భావాలతో సంభాషణ భళా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

News

Posted on 2025-09-24 14:48:41

Share: Share


భాష రాకున్నా భావాలతో సంభాషణ భళా  - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం సందర్బంగా డెఫ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నిజామాబాదు వారు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీస్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు వ్యక్తుల మధ్య సంభాషణకు భాష అవసరం.అలాంటి భాషను వినాలేని, మాట్లాడలేని బధిరులకు సమాచారాన్ని అర్థమయ్యే రీతిలో అందించేందుకు ఆవిర్భవించిందే సంకేత భాష విధానం అన్నారు. బాడీ లాంగ్వేజ్, శరీర కదలికలు, కనుబొమ్మలను కదపడం, ముఖ కవళికల ద్వారా ఎదుటి వ్యక్తితో సంభాషణ చేసే నైపుణ్యాన్ని సంకేత భాష అందిస్తుందని వేళ్లు లేదా చేతి సంజ్ఞల ద్వారా మనసులోని భావాలను వ్యక్తపరచడం గొప్ప విషయం అన్నారు. 2018 సెప్టెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మొదటిసారిగా అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని నిర్వహించిందని ఈ సంవత్సరం 2025 అంతర్జాతీయ సంజ్ఞా భాషల దినోత్సవం యొక్క థీమ్ "సంజ్ఞా భాష హక్కులు లేకుండా మానవ హక్కులు లేవు". అన్నారు.

సంజ్ఞా భాషను ఉపయోగించే వారి హక్కును గుర్తించకుండా  మద్దతు ఇవ్వకుండా బధిరుల హక్కులను పూర్తిగా సాధించలేమని ఈ థీమ్ నొక్కి చెబుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సౌందర్య, భూపతి సభ్యులు,తదితరులు పాల్గొన్నారు. సౌందర్య, భూపతి  సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపిఎస్

Posted On 2026-09-01 05:09:26

Readmore >
Image 1

పసుపు, కుంకుమతో కోట్ల దోపిడీ... సిరిసిల్లలో దొంగ బాబాల అరెస్ట్

Posted On 2026-08-31 16:20:41

Readmore >
Image 1

భక్తి మన బలం... భద్రత మన బాధ్యత...ఒక్క విషాదం కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకుందాం : ఎస్పీ రాజేష్ చంద్ర

Posted On 2026-08-31 16:13:50

Readmore >
Image 1

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Posted On 2026-08-31 16:06:18

Readmore >
Image 1

హిందీ ఫోరమ్ కామారెడ్డి మండల కార్యవర్గం ఎన్నిక

Posted On 2026-08-31 16:04:40

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా :ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి

Posted On 2026-08-31 14:42:24

Readmore >
Image 1

పంచజన్య సంకల్ప సభకు కామారెడ్డి నుంచి భారీగా తరలిన కార్యకర్తలు

Posted On 2026-08-31 14:40:45

Readmore >
Image 1

మహిళలకు కుటీర పరిశ్రమ ఏర్పాటు అభినందనీయం : సిరిసిల్ల కాంగ్రెస్ అధ్యక్షుడు సుర దేవరాజు

Posted On 2026-08-31 13:50:27

Readmore >
Image 1

వెయ్యి గొంతులు.. ఒక్కటే శబ్దం.. రావులపాలెంలో మార్మోగిన వేమన శతకం

Posted On 2026-08-31 13:49:27

Readmore >
Image 1

హైదరాబాద్ లో దారుణం... నర్సును గొంతు నులిమి హత్య, మృతదేహంపై అత్యాచారం అనుమానం

Posted On 2026-08-31 04:01:07

Readmore >