| Daily భారత్
Logo




మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి జైలు శిక్ష మరియు జరిమానా

News

Posted on 2025-09-10 18:18:33

Share: Share


మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి జైలు శిక్ష మరియు జరిమానా

మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన నిందితుడికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.15000 వేలు జరిమానా విధించిన గౌరవ ఒంగోలు POCSO కోర్ట్ వారు

పోక్సో కేసులో నిందితుడు శిక్షింపబడుటలో సమర్ధవంతంగా విధులు నిర్వహించిన పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్, ఐపీయస్.

డైలీ భారత్, ప్రకాశం జిల్లా:13 సం" మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి, బుధవారం గౌరవ POCSO కోర్ట్ జడ్జి కె.శైలజ, నిందితుడుకి 3 సం' జైలు శిక్ష మరియు రూ.15000/- జరిమానా విధించారు. కొమరోలు మండలానికి చెందిన మైనర్ బాలిక తన అమ్మమ్మ ఇంటిలో నివసిస్తోంది.  తేదీ:11.07.2022 ఉదయం సుమారు 11.30 గంటల సమయంలో బాధితురాలు ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో, అదే మండలానికి చెందిన కానే వెంకటేశ్వర్లు (41 సంవత్సరాలు, s/o చిన్న వెంకటేశ్వర్లు) ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలికి వెళ్లాడు. ఆ సమయంలో ముద్దాయి ఒక చేతితో బాలిక నోరు మూసి, ఆమెపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి తల్లి ఆ సమయంలో తన తల్లి ఇంటికి వెళ్ళగా, బాత్‌రూమ్ దగ్గర నుండి ఏదో శబ్దం వినిపించడంతో చూడగా, ముద్దాయి తన కుమార్తె నోరు మూసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు గమనించింది. ఆమె కేకలు వేయగానే, ముద్దాయి బాధితురాలిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తల్లి కొమరోలు పియస్ లో రిపోర్ట్ ఇవ్వగా అప్పటి SI సాంబశివయ్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి అతన్ని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు.

అనంతరం పోలీసులు సమయానుసారం సాక్షులను కోర్ట్ నందు హాజరు పరుచగా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు. జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్ ల క్రింద నేర నిరూపణ చెయ్యడంతో 10.09.2025న ఒంగోలులోని గౌరవ POCSO కోర్ట్ జడ్జి శ్రీ కె.శైలజ గారు నిందితుడుకి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు రూ.15000/- జరిమానా విధించారు. కేసులో ముద్దాయికి శిక్ష పడటంలో కృషిచేసిన ప్రస్తుతం పెద్దారవీడు SI సాంబశివయ్య, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొట్టిపాటి శ్రీనివాసరావు, కొమరోలు కానిస్టేబుల్ AV సుబ్బారెడ్డి, కోర్ట్ లైజన్ ASI E.V. స్వామి, కానిస్టేబుల్ M.యల్లమందలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >