| Daily భారత్
Logo




సంఘ నాయకులకు, జూనియర్లకు సిరిసిల్ల మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

News

Posted on 2025-09-10 16:28:13

Share: Share


సంఘ నాయకులకు, జూనియర్లకు సిరిసిల్ల మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి క్షేత్రస్థాయిలో గల సీనియారిటీ, ప్రతిభ, వినూత్న బోధనా పద్ధతులు ఆలంబించి ప్రభుత్వ విద్యా రంగ అభివృద్ధికి కృషి చేసిన టీచర్లకు మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులు అందించాలని నిర్ణయించి దానికిగాను బడ్జెట్ ను కూడా రిలీజ్ చేసింది. ఈరోజు సిరిసిల్ల మండలంలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో దశాబ్దాలుగా సేవలందించిన సీనియర్లను, ప్రతిభావంతులని కాదని జూనియర్లని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేయడం వివాదాస్పదమైంది.

మండల స్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల్లో తెలుగు, హిందీ,ఇంగ్లీష్, సోషల్, ఫిజికల్ ఎడ్యుకేషన్, సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగాల్లో సీనియర్లు ప్రతిభావంతులైనా టీచర్లు సిరిసిల్ల మండల పరిధిలో ఉండగా కేవలం జూనియర్లను మాత్రమే ఎంపిక చేయడం పట్ల టీచర్లలో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతుంది.  ఎంపిక చేసిన 16 మంది ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల్లో  ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యులు ఉండడం కోస మెరుపు. మండల స్థాయిలో ఉన్న ప్రతిభావంతులను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన సంఘ నాయకులు ఈ విధంగా తమకే అవార్డులు ఇప్పించుకోవడమేంటని ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన జూనియర్లకు మరియు సంఘ నాయకులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకి ఎంపిక చేశారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. మండలంలోని కేజీబీవీ లలో పనిచేస్తున్న టీచర్ల లో ఏ ఒక్కరిని ఈ అవార్డుకు ఎంపిక చేయకపోవడం విడ్డూరం.

నిబంధనల ప్రకారం రాష్ట్రస్థాయిలో కేజీబీవీ లలో పనిచేసే ఉపాధ్యాయులను  ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేశారు. కానీ సిరిసిల్ల మండలం లో అలా జరుగలేదు.

ఏది ఏమైనా సీనియర్లకి ప్రతిభ గల ఉపాధ్యాయులకి ప్రోత్సాహకరంగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పద్ధతిని క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు జరుపలేదనే ఆరోపణలు వస్తున్నాయి. వీటిని సవరించి అర్హులకు న్యాయం చేయాలని సిరిసిల్ల మండల  టీచర్లు,ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


కాగా రేపు ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వనున్నారు.

Image 1

రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

Posted On 2026-08-26 17:27:24

Readmore >
Image 1

దేవునిపల్లి లింగాపూర్ రోడ్డులో పోలీసుల విస్తృత తనిఖీలు

Posted On 2026-08-26 17:26:39

Readmore >
Image 1

డాక్టర్ బాలు కు “వాసవి నవరత్న అవార్డు”

Posted On 2026-08-26 17:25:51

Readmore >
Image 1

భారత్‌లో HIV నివారణ ఇంజెక్షన్.. డాక్టర్ రెడ్డీస్‌కు అనుమతి

Posted On 2026-08-26 17:24:49

Readmore >
Image 1

సిరిసిల్ల అయ్యప్ప ఆలయంలో కోటి కుంకుమార్చన వైభవం... 4వ రోజు 600 మంది మహిళలతో ఘనంగా

Posted On 2026-08-26 17:11:26

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా ఎన్సీపీ పార్టీ జిల్లా టీంతో సమావేశమైన మద్దిశెట్టి సామేలు

Posted On 2026-08-26 11:21:46

Readmore >
Image 1

పచ్చదనం కోసం మన అడుగు.. భవిష్యత్ తరాల కోసం మన బాధ్యత!

Posted On 2026-08-25 17:42:46

Readmore >
Image 1

యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

Posted On 2026-08-25 17:40:44

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో పలువురు పీఏసీఎస్‌ చైర్మన్ల నియామకం

Posted On 2026-08-25 17:39:09

Readmore >
Image 1

రాజన్న ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కొంపల్లి మహేష్ ఏకగ్రీవ ఎన్నిక

Posted On 2026-08-25 10:02:35

Readmore >