Posted on 2025-09-03 18:23:04
డైలీ భారత్, ముస్తాబాద్: భార్యను వేధించిన భర్తకు మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 10,000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ ఈరోజు తీర్పు వెల్లడించినట్లు ముస్తాబాద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు.
ఈసందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ…
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన సదిమెల రామచంద్రం తన భార్య కనకవ్వను తరచూ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని తెలిపారు. మద్యం సేవించి గొడవలు పెట్టడంతో పాటు 2016 డిసెంబర్ 2న ఉదయం 6 గంటల సమయంలో భార్యను దారుణంగా కొట్టాడని, టార్చ్‌లైట్‌తో దాడి చేసి గాయాలు చేశాడని తెలిపారు.వేధింపులు భరించలేక బాధితురాలు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడు సదిమెల రామచంద్రం పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అనంతరం అప్పటి ఎస్.ఐలు చిట్టిబాబు, ప్రవీణ్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా, ఎస్.ఐ గణేష్, సీఎంస్ ఎస్.ఐ శ్రవణ్, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ తో పాటు 12 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందితుడు రామచంద్రంపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి ప్రవీణ్ మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ తెలిపారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >