| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారి రక్షణకు సహాయక చర్యలు

ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద చిక్కుకున్న వారి రక్షణకు సహాయక చర్యలు

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బి గితే

ఘటనా స్థలికి చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్ బృందం

డైలీ భారత్, గంభీరావుపేట: గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పి మహేష్ బి గితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు  ఐదుగురు వెళ్లారు. ఇవతలి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తూ వారిలో ఒకరు గల్లంతు కాగా, మిగతా నలుగురు అక్కడే చిక్కుకుపోయారు. దీంతో కలెక్టర్ ఎస్పీ వెంటనే హుటాహటిన ప్రాజెక్ట్ వద్దకు చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలకి చేరుకొని  చిక్కుకున్న వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

Previous శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తివేసిన అధికారులు.. లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
Next ఉత్తమ ఉపాధ్యాయురాలిని సన్మానించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
ADVERTISEMENT