| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు కేటాయించాలి : బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు కేటాయించాలి : బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అర్హులైన వారికి ప్రభుత్వ ఇళ్లు కేటాయించాలని, కొత్త రేషన్ కార్డులను వెంటనే అందించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చుంచుపల్లి మండల బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమానికి మండల బీజేపీ అధ్యక్షుడు బలగం శ్రీధర్ నేతృత్వం వహించగా, నాయకులు పొనగంటి రాజు, బడే రమేష్, రతన్ లాల్, పెరబోయిన నరసింహరావు, సతీష్, సొప్పరి క్రాంతి, సలీం తదితరులు పాల్గొన్నారు.

Previous మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి : జెడ్పీహెచ్‌ఎస్ అంబేద్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల విద్యార్థులు
Next పాత పాల్వంచలో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల తండ్రి నారాయణ వర్ధంతి
ADVERTISEMENT