Posted on 2025-08-11 16:12:55
జేసీబీతో మరమ్మతులు చేసిన డా జమాల్ ఖాన్
వైద్యంలోనే కాదు సాయంలోనూ ముందుంటున్న జమాల్ ఖాన్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుండి చర్లకు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలలో భద్రాచలం నుండి గౌరవరం వెళుతున్న మెటల్ లోడు టిప్పర్ అదుపుతప్పి గోతిలో పడిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గంటల కొలది వ్యవధి కావడంతో రెండు వైపులా భారీ వాహనాలు ఆర్టిసి బస్సులు ప్రైవేటు వాహనాలు చిక్కుకున్నాయి. విషయం తెలుసుకున్న జేకేసిటీ ట్రస్ట్ చైర్మన్ ఎండి జమాల్ ఖాన్ వెంటనే ట్రాఫిక్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటనను తెలుసుకొని వెంటనే జెసిబి తెప్పించి గోతులను పూడ్చి రహదారి సౌకర్యాన్ని కల్పించడంతో ఇరు రువైపులా వాహనాల రవాణా క్లియర్ చేశారు. ఇది గమనించిన ఎటపాక పోలీసు సిబ్బంది వాహనాలను అదుపు చేస్తూ భారీ వాహనాలను నియంత్రిస్తూ ట్రాఫిక్ సమస్యను తొలగించారు. టిప్పర్ డ్రైవర్ అనారోగ్యం వలన జ్వర పీడితుడు కావడంతో ఈ ఘటన జరిగిందని తెలియడంతో డ్రైవర్ను తన ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆహారం ఇచ్చి చికిత్సలు కూడా జమాల్ ఖాన్ నిర్వహించారు. భారీ స్థాయిలో చర్ల వైపు నుండి ఎటపాక మండలం మీదుగా తెలంగాణ వైపుకు వెళుతున్న ఇసుక లారీల తాకిడికి రోడ్డు ధ్వంసం అయింది. గతంలో స్థానికులు కూడా భారీ స్థాయిలో రాత్రి పగలు తరలి వెళ్తున్న ఇసుక వాహనాల వలన దుమ్ము ధూళితో వాహనదారులు గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన కూడా చేపట్టడం జరిగింది. జమాల్ ఖాన్ సహాయంతో ఈరోజు సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జెకేసి ట్రస్ట్ సభ్యులు నటరాజ్, అజీజ్, జావీద్, షాజహాన్ పాల్గొన్నారు.
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్
Posted On 2026-07-29 08:54:06
Readmore >
చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ
Posted On 2026-07-29 08:52:51
Readmore >
మహిళా లెక్చరర్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
Posted On 2026-07-29 08:51:28
Readmore >