బాన్సువాడలో మంత్రి సీతక్క ఎదుట రచ్చకెక్కిన కాంగ్రెస్ వర్గ విభేదాలు... ఖంగుతిన్న మంత్రివర్యులు
డైలీ భరత్ న్యూస్, నిజామాబాద్: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఎదుట బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరు ఒక్కసారిగా బయటపడింది. ఆదివారం బాన్సువాడ పర్యటనలో పాల్గొన్న మంత్రి సీతక్క పలు కార్యక్రమాల్లో పాల్గొనడానికి హాజరయ్యారు. అయితే బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి ల మధ్య వర్గ పోరు ముదిరి పాకన పడింది. అయితే బాన్సువాడ పట్టణానికి వచ్చిన సీతక్క పట్టణంలోని పంచాయతీరాజ్ భవనంలోకి సమావేశం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లగా తాను కూడా మంత్రితోపాటు పంచాయతీరాజ్ భవనంలోకి వెళ్తానంటూ వెళ్ళబోతుండగా పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. ఆయనను లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీకి చెందిన వాడిన కాదా మంత్రిగారే సమాధానం చెప్పాలి అంటూ పార్టీకి చెందిన నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో ఒక దశలో పరిస్థితి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. దీంతో కంగుతిన్న మంత్రి ఒకపక్క జనహిత పాదయాత్ర నడుస్తుండగా మరోవైపు సొంత పార్టీకి చెందిన నేతలే ఇలా చేయడం మంచిది కాదంటూ సదరు నేతలకు హితవు పలికినట్లు తెలుస్తుంది